టీవీల్లో టెలికాస్ట్ కాబోతున్న బ్లాక్ బస్టర్ చిత్రం ‘దసరా’.. ఈ తేదీనాడే?

by Anjali |   ( Updated:2023-09-21 08:45:43.0  )
టీవీల్లో టెలికాస్ట్ కాబోతున్న బ్లాక్ బస్టర్ చిత్రం ‘దసరా’.. ఈ తేదీనాడే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్నేహం, ప్రేమ అంశాలతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘దసరా’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాను.. క్రియేటివ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదేల తెలంగాణలోని సింగరేణి ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ధరణి పాత్రలో నాని నటించగా.. వెన్నెలగా కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 30 వ తారీకున థియేటర్లలో విడుదలయ్యి.. ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూసే సమయం వచ్చేసింది. ఈ నెల (సెప్టెంబరు) 24న జెమిని టీవీలో సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ అవుతుందని నాని ట్వీట్ చేశారు. ఈ వార్త విన్న నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story