Sara Ali Khan: విమానంలో స్టార్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

by Kavitha |
Sara Ali Khan: విమానంలో స్టార్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ అందరికీ సుపరిచితమే. సింబాతో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.ఇటీవల ‘మర్డర్ ముభారక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ న్యూ ప్రాజెక్ట్ ప్రకటించనప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

రీసెంట్‌గా సారా ఓ ఫ్లైట్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఫ్లైట్‌లో తన సీట్‌లో కూర్చొని ఉండగా.. ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ ఆమె జ్యూస్ ఇచ్చేందుకు వచ్చింది. అయితే ఆ జ్యూస్ కాస్త పొరపాటుగా ఆమె మీద పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు పైలెట్లు ఆమె సీట్ దగ్గర వచ్చారు. ఎయిర్ హోస్టెస్ కూడా అక్కడే ఉంది. వారి వైపు సారా సీరియస్‌గా చూస్తూ తన సీట్ నుంచి లేచి వాష్ రూమ్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది నిజంగా అలా జరిగింది కావచ్చు అని అంటుంటే.. మరికొంత మంది సినిమా ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(video link credits to manav manglani instagram id)



Next Story