Dhanush: బిచ్చగాడిలా మారిన అపర కుబేరుడు.. విశేషంగా వైరల్ అవుతున్న లుక్

by sudharani |
Dhanush: బిచ్చగాడిలా మారిన అపర కుబేరుడు.. విశేషంగా వైరల్ అవుతున్న లుక్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘కుబేర’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్న మేకర్స్. ఈ మేరకు డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నా. ఈ క్రమంలోనే ఈ రోజు సూపర్ స్టార్ ధనుష్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ధనుష్ మాసిన గడ్డంతో బిచ్చగాడిలా డిఫరెంట్ లెక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌గా వైరల్ అవుతోంది.

ఇదివరకూ ఎన్నడూ చేయని క్యారెక్టర్‌లో ధనుష్ కనిపిస్తుండగా.. ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కాగా.. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్‌గా రానుంది.

Advertisement

Next Story