నాగిని సీరియల్ ఫేమ్ జాస్మిన్ భాసిన్ పుట్టినరోజు

by Prasanna |
నాగిని సీరియల్ ఫేమ్ జాస్మిన్ భాసిన్ పుట్టినరోజు
X

దిశ, సినిమా : జాస్మిన్ భాసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో బిగ్ బాస్ నుంచి కూడా పిలుపు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ 1990, జూన్ 28 న జన్మించింది. పంజాబీ చిత్రాలతో పాటు హిందీ సిరియల్స్ లో కూడా నటించింది. 2011 తమిళ చిత్రం వానంలో తెరంగేట్రం చేసింది. తషాన్-ఎ-ఇష్క్ (2015–16)లో ట్వింకిల్ తనేజాగా, దిల్ సే దిల్ తక్ (2017–18)లో తేనీ భానుశాలి పాత్రలో భాసిన్ బాగా పేరు పొందింది. ఆమె ఖత్రోన్ కే ఖిలాడీ 9, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ - మేడ్ ఇన్ ఇండియా , సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ 14 వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. నాగిని 3 సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. నేడు ఈ బ్యూటీ 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు

Next Story

Most Viewed