కేంద్రం ఆదేశాలతోనే కేజ్రీవాల్ అరెస్ట్.. న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు: ఆప్ ఎంపీ

by Harish |
కేంద్రం ఆదేశాలతోనే కేజ్రీవాల్ అరెస్ట్.. న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు: ఆప్ ఎంపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే సీబీఐ కల్పిత ఆరోపణలతో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందని అన్నారు. న్యాయవ్యవస్థను, శాంతిభద్రతలను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కేంద్రంపై ఆయన విమర్శలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాయి. ఈడీ, సీబీల వద్ద ఎలాంటి రుజువులు లేనప్పటికి మనీష్ సిసోడియాపై కేసుల మీద కేసులు పెట్టారు, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కనీసం ఆయనకు వ్యతిరేకంగా డబ్బును కూడా రికవరీ చేయలేకపోయిందని సంజయ్ సింగ్ అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే పొందేందుకు ఈడీ రాజ్యాంగ విరుద్ధమైన, చట్టవిరుద్ధమైన రీతిలో హైకోర్టును ఆశ్రయించిందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌‌ను సీబీఐ చేత అరెస్ట్ చేయించారు. ఆయన బయటపడతారని కేంద్ర ప్రభుత్వం భావించింది, అందుకే వెంటనే వెళ్లి అరవింద్ కేజ్రీవాల్‌పై కొత్త కేసు నమోదు చేసి సీబీఐ చేత అరెస్ట్ చేయించిందని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

మరోవైపు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా ఆదివారం మాట్లాడుతూ, హేమంత్ సోరెన్ జైలు నుండి బయటకు వచ్చినట్లే, కేజ్రీవాల్‌ కూడా బయటకు వస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీలను ఆయుధంగా వాడుకుని ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తుంది. ఇంకా, నీట్ పరీక్షలపై మాట్లాడిన మనోజ్ ఝా, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడాన్ని ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని, అలా ఊరుకుంటే చరిత్ర క్షమించదని అన్నారు. విద్యార్థులు న్యాయం కావాలని వీధుల్లో తిరుగుతున్నారు. వెంటనే వాళ్లకు కలిగిన నష్టాన్ని పూడ్చాలని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed