నా బాడీ నా ఇష్టం.. ఎలాగైనా చూపిస్తా : బిపాసా

by Hamsa |   ( Updated:2022-09-02 08:16:39.0  )
నా బాడీ నా ఇష్టం.. ఎలాగైనా చూపిస్తా : బిపాసా
X

దిశ, సినిమా : బేబీ బంప్ ఫొటోషూట్‌పై నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి బిపాసా బసు.. తాజాగా ఈ ఇష్యూపై స్పందించింది. 2016లో గ్రోవర్‌ను పెళ్లి చేసుకున్న ఆమె ఇటీవల గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడిస్తూ సంబంధిత ఫొటోలను నెట్టింట పోస్ట్‌ చేసింది. అయితే ఈ పిక్స్‌లో తను కొంచెం బోల్డ్‌‌గా దర్శనమివ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నెటిజన్లు.. 'ప్రెగ్నెంట్ అని చెప్పి స్కిన్‌ షో చేస్తావా?' అంటూ నెగెటివ్ కామెంట్స్‌ చేశారు. దీంతో మనస్తాపం చెందిన నటి తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

'జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. మనం వారి అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించాలి. నాకు నచ్చినట్లే నా జీవితాన్ని లీడ్‌ చేస్తున్నా. 99 శాతం మంచిపైనే దృష్టిసారిస్తా. కేవలం ఒక్క శాతమే నెగెటివిటీకి సమయం కేటాయిస్తా. జీవితాన్ని ముందుకు నడిపించాల్సిన పద్ధతి కూడా ఇదే. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారన్న దానిపై మీ వ్యక్తిత్వం ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు' అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు మన శరీరాన్ని మనమే అమితంగా ప్రేమించాలనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతానన్న ఆమె.. జనాలు కూడా అదే అనుసరిస్తే మంచిదని సూచించింది.

Also Read : ఇదేం కర్మ నాయనా... ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్న అన్నా-చెల్లెళ్లు!

Advertisement

Next Story