- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 6 Telugu: 'గ్రాండ్ ఫినాలేకు ఆల్ ది బెస్ట్'.. రేవంత్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్
దిశ, సినిమా: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఫైనల్‌కు వచ్చింది. డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక ఫైనల్‌గా మిగిలింది కంటెస్టెంట్‌లకు ఎంతో ముఖ్యమైన ఓటింగ్ మాత్రమే. ఇప్పుడిక గత 14 వారాల ఓట్లతో ఫైనల్‌కు సంబంధం లేదు. ఈ వారం అధికంగా ఓట్లు సంపాదించిన కంటెస్టెంట్ మాత్రమే విన్నర్ అవుతారు. ఇక ఇప్పటి వరకు గెలుపు కోసం మూడు నెలలుగా పోరాడి, మానసికంగా, శారీరకంగా, కలిగే ఒత్తిడి నుంచి, మంచి అనుభూతిని ఇవ్వాలని డిసైడ్ అయిన బిగ్‌బాస్, మంచి మంచి సర్ ఫ్రైజ్‌లు ఇస్తున్నారు.
ఇందులో భాగంగా రేవంత్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. బిగ్‌బాస్ మాట్లాడుతూ ''నీ కోపమే నీకు బలహీతగా మారింది. అది ఇంట్లో చాలా పొరపాట్లకు కారణమైంది. ఆ విషయాన్ని త్వరగా తెలుసుకొని, అందుకు తగ్గట్లు మారి, కోపాన్ని ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. నిజానికి జీవితంలో అన్ని భావోద్వేగాలు ఉన్నవారే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే అద్భుత క్షణాలు దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని బిగ్‌బాస్ కారణంగా కోల్పోయిన మీ త్యాగానికి ప్రతిఫలం దక్కాలని, బిగ్‌బాస్ ఫినాలేకు బిగ్‌బాస్ తరఫున ఆల్ ది బెస్ట్'' అని చెప్పాడు.