అతనితో పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ..

by sudharani |   ( Updated:2022-09-02 13:57:53.0  )
అతనితో పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ..
X

దిశ, సినిమా: పలు సినిమాల్లో సహాయనటిగా కనిపించి, బిగ్‌బాస్‌‌లో అడుగుపెట్టిన భానుశ్రీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 'మౌనం', 'నల్లమల' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఫ్యాన్స్‌ను అలరించింది. భాను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుండగా.. త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. తన ప్రియుడితో ఏడడుగులు వేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ ప్రియుడు ఎవరు అనుకుంటున్నారా?.. తాను ఓ వ్యక్తి వల్లే ఇలా ఉన్నానని, హైదరాబాద్‌లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని భాను చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read : Hot News: డబ్బు కోసమే అబ్బాయిలతో పడుకున్నా.. ప్లీజ్ వీడియోలు డిలీట్ చేయండి

Advertisement

Next Story