ఫైనల్‌గా యస్ చెప్పాడంటూ అతడితో లవ్ కన్ఫామ్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. వీడియో వైరల్!

by Hamsa |   ( Updated:2024-02-16 04:31:51.0  )
ఫైనల్‌గా యస్ చెప్పాడంటూ అతడితో లవ్ కన్ఫామ్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. వీడియో వైరల్!
X

దిశ, సినిమా: బుల్లితెర నటి శుభశ్రీ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 షోకు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన ఆట తీరుతో అందరినీ మెప్పించడంతో పాటుగా అమర్ దీప్‌తో ఓ సారి గొడవ పడి నా మనోభావాలు దెబ్బతిన్నాయ్ అనే డైలాగ్‌తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. శుభశ్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణతో కాస్త చనువుగా ఉండటంతో అంతా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. అయితే ఈ అమ్మడు బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక గౌతమ్ ఇంటికి వెళ్తూ మా అత్తారింటికి వెళ్తున్నా అంటూ ఓ వీడియో చేయడంతో అంతా నిజమేనని నమ్మేశారు.

ఇక శుభశ్రీ బిగ్’బాస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ టేస్టీ తేజతో పలు వీడియోలు చేసి అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, శుభశ్రీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా షేర్ చేసింది. అందులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణను ఓ స్పెషల్ ప్లేస్‌కి తీసుకెళ్లి అతడిని సర్‌ప్రైజ్ చేసింది. అంతేకాకుండా అతడిని పలు విషయాలను గురించి అడిగింది. ఆ తర్వాత చివరగా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలపడంతో గౌతమ్ ఆమెను హగ్ చేసుకుంటాడు.

అంతటితో ఆగకుండా రోజ్ ఫ్లవర్ కూడా ఆమెకు ఇస్తాడు. అప్పుడు శుభశ్రీ ఎప్పుడైనా ప్రపోజ్ చేసావని అడగ్గా అతను ఇంతకు చేసా అని చెప్తాడు. దీంతో నాలో ఆమెను చూస్కొని మరోసారి ప్రపోజ్ చేయమంటుంది. దానికి అతను రింగ్ పెట్టి మరీ ఐలవ్ యూ చెప్తాడు. దానికి ఆమె కూడా ఒకే చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి తింటారు. అయితే ఇదంతా వీడియో కోసం మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. బయట వీరిద్దరు మంచి ఫ్రెండ్స్.. ఇదే విషయం గురించి వారు స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వీడియోకు శుభశ్రీ ఫైనల్‌గా అతను ఒకే చెప్పాడు అని పెట్టి షేర్ చేయడంతో అందరూ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.


Advertisement

Next Story