- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది కదా లక్ అంటే.. పవర్ స్టార్ పక్కన చాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ.. హౌస్‌లో ఉన్నది ఐదు వారాలే అయినప్పటికీ మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఒడిశాకు చెందిన ఈ అమ్మడు బిగ్ బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంది. అయితే.. అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు వచ్చి అందరిని షాక్‌కు గురిచేసింది. దాదాపుగా శుభశ్రీని టాప్ 7 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఉంటుందని చాలా మంది భావించారు. కానీ, ఇలా ఎలిమినేట్ అవ్వడం తన బాడ్ లక్ అని కూడా కొంత మంది తమ అభిప్రాయాలను తెలిపారు. అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లక్ అంటే శుభశ్రీదే అనుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం పట్టేసింది ఈ బ్యూటీ.
ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్తూ.. ‘నా అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించడానికి, స్క్రీన్‌ను పంచుకోవడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పక్కా పవర్ స్టార్ అభిమానిగా ఆయన ‘OG’ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాలో ఉన్న టాలెంట్‌ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్, డీవీవీ మూవీస్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ప్రతి క్షణం నన్ను ఆధరిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, నన్ను ప్రేమిస్తున్న ఆడియన్స్‌కు నా స్పెషల్ థ్యాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చింది. శుభశ్రీ పోస్ట్ వైరల్ కావడంతో.. ఇది కదా సక్సెస్ అంటే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.