ఎన్నికల ఫలితాల టెన్షన్ నుంచి బయట పడలా.. ఈ ఫోటోస్ చూసేయండి!

by Jakkula Samataha |   ( Updated:2024-06-04 03:30:09.0  )
ఎన్నికల ఫలితాల టెన్షన్ నుంచి బయట పడలా.. ఈ ఫోటోస్ చూసేయండి!
X

దిశ, సినిమా : బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అందానికి పెట్టింది పేరు. బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మడు మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్‌లో ఈమె తన అందాలతో మాయచేసింది. కళ్లు చెదిరే అందంతో కుర్రకారుకు నిద్ర కరువు అయ్యేలా చేసింది. దీంతో ఈమె అందానికి ఫిదా అయిపోయిన యూత్.. బిగ్ బాస్‌లో ఈ బ్యూటీ కోసం సపోర్ట్ చేయడమే కాకుండా తను విన్నర్ అవ్వాలని కూడా తెగ కోరుకున్నారు.

అయితే ఈ బ్యూటీని మొదటగా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశారు. వర్మ, ఇనయా ఓ ప్రైవేట్ పార్టీలో మందు కొడుతూ ఉన్న ఫోటోస్ వీడియోస్‌ను ఇన్ స్టాలో పోస్టు చేయడంతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. అసలు ఎవరా.. ఈ నటి అంటూ తెగ సెర్చ్ చేశారు. అయితే ఇనయా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోస్‌తో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన అందాలను ఆరోబోస్తూ ట్రెండీ డ్రెస్‌లో ఉన్న ఫోటోస్‌ను షేర్ చేసింది. ఇందులో ఇనయా గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇంత అందం ఉన్న ఈ ముద్దుగుమ్మకు సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లలో అవకాశాలు ఇవ్వచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఎన్నికల రిజల్ట్స్ టెన్షన్‌లో ఉన్నారా .. అయితే ఈ ఫోటోలు చూడండి, వెంటనే రిలీఫ్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed