ఇద్దరం ఒకేసారి అంటూ మెగా కోడలిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ అభిజిత్!

by Hamsa |   ( Updated:2024-02-02 05:14:26.0  )
ఇద్దరం ఒకేసారి అంటూ మెగా కోడలిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ అభిజిత్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని మెగా కోడలైంది. ఆ తర్వాత కొద్ది కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మిస్ ఫర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సిరీస్‌కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేయగా.. బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్ అభిజీత్ దుద్దాల హీరోగా చేశాడు.

అయితే మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిజిత్, లావణ్య త్రిపాఠిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ లావణ్య త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. తను మంచి కోస్టార్ ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉండేది. మా మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చేసే క్రమంలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను, తను దాదాపు ఇద్దరం ఒకే టైమ్‌లో కెరీర్ స్టార్ట్ చేశాం. అయితే లావణ్య నాకంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. నేను ఈ సిరీస్ చేయడం మా ఇంట్లో వాళ్లకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. లావణ్య యాక్టింగ్‌ను మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టపడతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అభిజిత్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story