Bigg boss-6 టైటిల్ నాదే.. సీక్రెట్ చెప్పేసిన స్టార్.. సాక్ష్యం ఇదే

by sudharani |
Bigg boss-6 టైటిల్ నాదే.. సీక్రెట్ చెప్పేసిన స్టార్.. సాక్ష్యం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ కాలంలోనే బుల్లితెరపై పాపులారీటి సంపాదించుకున్న షోలలో బిగ్‌బాస్ షో ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో సీజన్‌కు ముస్తాబయింది. ఇదిలా ఉంటే.. ఈ షోలో స్టార్ సింగర్ రేవంత్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు స్వయంగా తానే తెలిపాడు. దానికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవంత్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా.. ఇంకా హౌస్‌లోకి అడుగుపెట్టక ముందే టైటిల్ నాదే అంటూ ధీమాగా తాను షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. షో స్టార్ట్ అయ్యేవరకు ఎవరెవరు హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారు అనే విషయాన్ని బయటకి తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు షో యాజమాన్యం. కానీ సింగర్ రేవంత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆ సీక్రెట్ రివీల్ చేసేయడంతో అందరూ షాకవుతున్నారు. కాగా, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-6 సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 'స్టార్ మా' తో పాటుగా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌' లో ప్రచారం కాబోతుంది.




Advertisement

Next Story

Most Viewed