Ram Charan: బిగ్ సర్‌ప్రైజ్.. రామ్‌చరణ్ భార్యగా టాలీవుడ్ బ్యూటీ!

by sudharani |
Ram Charan: బిగ్ సర్‌ప్రైజ్.. రామ్‌చరణ్ భార్యగా టాలీవుడ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రజెంట్ రెండు మూడు మూవీస్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ఛేంజర్‌’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ మూవీకి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇప్పటి వరకు అంజలి పాత్ర గురించి ఎటువంటి న్యూస్‌ రాలేదు. కానీ దీనిపై తాజాగా అందుకున్న సమాచారం మేరకు.. ఇందులో అంజలి రామ్‌చరణ్‌ భార్యగా కనిపించనుందని తెలిసింది.

రామ్‌చరణ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఆమె ఈ క్యారెక్టర్‌లో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుందట. ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి ఎంతో నమ్మకంగా ఉంది. అంతే కాకుండా ఈ రోల్ మళ్లీ టాలీవుడ్‌లో తనను బిజీ చేస్తుందని ఆమె విశ్వసిస్తుంది. ఇటీవల విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రంలో కూడా అంజలి విశ్వక్‌సేన్‌ ప్రియురాలిగా నటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సీనియర్‌ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు యువ కథానాయకుల జోడిగా కూడా ఈ తెలుగమ్మాయి నటించడం విశేషం.



Next Story

Most Viewed