- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుట్టెడు కష్టాల్లో ఉన్న నటికి.. ‘భీమ్లా నాయక్’ నటుడి సాయం
దిశ, సినిమా: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి పావలా కల్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాబాయ్ అబ్బాయ్, బాబాయ్ హోటల్, ఖడ్గం, ఆంధ్రావాలా, గోలీమార్ వంటి సినిమాల్లో తనదైన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. 1984 నుంచి సినీ రంగంలో బిజీగా కొనసాగుతున్న శ్యామల దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆమె చాలా దీనస్థితిలో ఉన్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వంటి పుట్టెడు కష్టాలతో బతుకు జీవితాన్ని లాగుతున్నారు. ఆమె ఎలా మారింది అంటే చివరికి ఆమె ఆర్థిక కారణాల వల్ల ఆ అవార్డులు, రివార్డులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చారు.
తాజాగా.. ఆమె పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ఆమెకు సహాయం అందించారు. ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమంలో ఉంటున్న శ్యామలను కలిసి రూ.25,000 నగదు సాయాన్ని చెక్ రూపంలో అందించారు. ఆమెకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలు తీర్చేలా సహాయం చేశారు. దీంతో కిరణ్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, కాదంబరి కిరణ్ ఇటీవల పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్రలో నటించారు.