- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వశక్తితో నా కెరీర్ నిర్మించుకోవాలనుంది: Bevelyn Bharrajj
దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన బెవిలిన్ భరాజ్.. నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టానంటోంది. తాజాగా ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానామిచ్చిన ఆమె.. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్‌కు సంబంధించిన వివరాలు షేర్ చేసుకుంది.
టాలీవుడ్ సినిమాలే ఎందుకు చేయాలనుకున్నారు?
ముంబైకి చెందిన తనకు ఫ్యాషన్ మోడలింగ్‌లో మంచి పేరుందని చెబుతూ.. 'మేము 'రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ నిర్వహిస్తోంది. నేను ఈ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది. ఫ్యాషన్ మోడలింగ్‌లో అడుగుపెట్టి మంచి విజయం సాధించాను. ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులారిటీ పొందాను. ఇప్పుడు సినిమాల్లో నటించాలనే నా కోరికను మా పేరెంట్స్ ప్రోత్సహిస్తున్నారు. నేను నటనలో, డాన్సుల్లో, ఫైట్స్‌లో శిక్షణ పొందాను. సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూస్తుంటా. బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినిమాని జాతీయ స్థాయికి చేర్చాయి. దీంతో తెలుగులోనే నటించాలని ఫిక్స్ అయ్యాను.
ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
ప్రస్తుతానికి తెలుగు సినిమాలే చేయాలనుకుంటున్నా. అందుకే హైదరాబాద్ వచ్చాను. పలువురు దర్శక నిర్మాతలను కలిశా. ఇంకా కొందరినీ కలుస్తునే ఉన్నా. హీరోయిన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోపాటు యాక్షన్ మూవీస్‌కు కూడా న్యాయం చేయగలను. త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తా. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ బంధువులు, స్నేహితులు చాలామంది మంచి పొజిషన్‌లో ఉన్నారు. అయితే నేను ఎవరి పేరు ఉపయోగించుకోకుండానే స్వశక్తితో నా కెరీర్ నిర్మించుకోవాలనుకుంటున్నా. అందుకే వారి పేర్లు చెప్పడం లేదు. హాలీవుడ్ హీరోయిన్‌లా కనిపించడం నా ప్రత్యేకత.
ఇవి కూడా చదవండి:
చీర కట్టుతో అబ్బురపరిచిన బుట్ట బొమ్మ.. ఆ అందానికి ఫ్యాన్స్ ఫిదా!