- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమాల్లో సెక్స్, హింస, గంజాయి కంటెంట్ సెన్సార్ రేటింగ్స్‌పై BBFC కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఏజ్ వారే చూడాలి!
దిశ, సినిమా: ఇటీవల తెరకెక్కుతోన్న సినిమాల్లో సెక్స్, హింస, గంజాయి సహా మాదకద్రవ్యాల దుర్వినియోగం ఎక్కువగా చూపిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి చిత్రాలు చూడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాగా బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC)తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి సీన్స్ ఎక్కువగా ఉన్న చిత్రాలకు వయసు రేటింగ్ ఇవ్వనుంది. బ్రిటీష్ ప్రజల అభిప్రాయాలను స్వీకరించి.. కొత్త గైడ్ లైన్స్ పెట్టింది.
2019 మార్గదర్శకాలలో 12A/12 కింద వర్గీకరించబడిన కొన్ని లైంగిక సన్నివేశాలను ప్రస్తుతం 15 ఏళ్ల వయస్సుకు రేటింగ్ కు పెంచింది. మూవీలకు రేటింగ్ ఇచ్చే విషయంలో ఫిల్మ్ బోర్డ్ తన సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. పోయిన సంవత్సరం దాదాపు 12 వేల మందితో మాట్లాడి.. ఒక నిర్ణయానికి వచ్చింది. వీరిలో పలు వయసుల వారిని భాగస్వామ్యం చేసింది. ఏ సినిమాలకు ఎంత రేటింగ్ ఇవ్వాలి? ఎలాంటి సినిమాలకు ఎంత ఇవ్వాలి. అని చర్చించింది.
కాగా BBFC డ్రగ్స్ సన్నివేశాలు కలిగిన చిత్రాల విషయంలో తక్కువ వయసు రేటింగ్ ను ఇస్తుంది. పారామౌంట్ ‘బాబ్ మార్లే: వన్ లవ్’ సినిమా విషయంలోనూ ఫిల్మ్ బోర్డ్ ఇదే విషయాన్ని పాటించింది. ఇందులో డ్రగ్స్ వినియోగం ఉన్నా, కొత్త మార్గదర్శకాల ప్రకారం 12A రేటింగ్ ను ఇచ్చింది. భవిష్యత్తులో డ్రగ్స్ వినియోగం ఉన్న సినిమాలకు 15 రేటింగ్ ఇవ్వనున్నారని వెల్లడించింది. లైంగిక, స్త్రీ ద్వేషపూరిత అర్థాలు ఉన్న చిత్రాలకు ఎక్కువ రేటింగ్ ఇవ్వాలని తెలిపింది.
అంతేకాకుండా ‘బిచ్ ఆఫ్ ఎ బిచ్, బిచ్, డిక్’ వంటి పదాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి పదాలను యుక్త వయస్సు వాళ్లు వినడం ఏమాత్రం కరెక్ట్ కాదని తెలిపింది. ఇలాంటి పదాలను వాడే మూవీలకు ఎక్కువ ఏజ్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుత రోజుల్లో వచ్చే మూవీస్ ప్రజల మీద ప్రభావం చూపిస్తున్నాయని, వాటిని వాటిని సర్టిఫై చేసే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నామని.. గతంలో తెరకెక్కిన సినిమాలతో పోల్చి చూస్తే ఇప్పటి సినిమాల్లో ఆందోళన చెందే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటూ బీబీఎఫ్‌సీ ప్రెసిడెంట్ నటాషా చెప్పుకొచ్చారు.