- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Atchannaidu: చర్యలు తప్పవ్.. అసభ్య పోస్టులపై మంత్రి అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో విమర్శలు మరింతగా శృతి మించుతున్నాయి. ఆడ, మగ, చిన్నా, పెద్దా, మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. మంచి, చెడు అనేది ఏమీ లేకుండా తమకు నచ్చకపోతే సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమందిని టార్గెట్ చేసి ఫొటోలు సైతం మార్ఫింగ్ చేసి అభ్యకరంగా దూషణలు చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులపై ఏపీ ప్రభుత్వం(AP Government)పై దృష్టి పెట్టింది. అసభ్యకర పోస్టుల పెడితే అరెస్టులు చేస్తోంది. ఇలా వైసీపీ(Ycp)కి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minsiter Vangalapudi Anitha), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల(Congress State Chief Sharmila), ఆమె తల్లి వైఎస్ విజయమ్మ(Ys Vijayamma)తో పాటు పలువురు మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో వారందరిని అరెస్టులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) స్పందించారు. గుంటూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఐదేళ్లు వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేశారని, ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై మాట్లాడే నైతికహక్కు మాజీ సీఎం జగన్(Former Cm Jagan)కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.