Minister Ponnam Prabhakar : అభివృద్ధి నిరంతర ప్రక్రియ

by Kalyani |
Minister Ponnam Prabhakar : అభివృద్ధి నిరంతర ప్రక్రియ
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంలో భాగంగా గురువారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam ప్రభాకర్ )హుస్నాబాద్ పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3,4,5,18 వార్డులలో వార్డుకు రూ. 50 లక్షలు చొప్పున రూ. 2 కోట్ల తో వేరువేరుగా కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chaudhary )తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పట్టణంలోని గాంధీ, అంబేద్కర్, నాగారం, కరీంనగర్ రోడ్డు లోని నాలుగు చౌరస్తాలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించామని ఎల్లమ్మ చెరువు బండ్ అభివృద్ధికి రూ. 18 కోట్లు టెండర్ పూర్తయి సిద్ధంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులన్నింటికీ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి చేత ఫౌండేషన్ వేయిస్తానని తెలిపారు. వీటితోపాటు ఏసీపీ కార్యాలయం, మార్కెట్, లైబ్రరీ, మున్సిపాలిటీ, కరీంనగర్ నాలుగు లైన్ల రహదారి, 150 పడకల ఆసుపత్రి, సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం అభివృద్ధి, స్టేడియం పనులు అన్నింటికి ఒకేసారి ప్రారంభించు కుంటామని తెలియజేశారు. డ్రైనేజీ సిస్టం ఏర్పాటుకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని మెయిన్ రోడ్డులో కమిషనర్ విజిట్ చేసి మరమ్మతులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి వద్ద స్థల పరిశీలన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్, టీచర్ల ట్రాన్స్ ఫర్ విషయంలో ఏమి చేయలేనని ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు.

తెలంగాణ ను రోల్ మోడల్ గా దేశానికి దిక్సూచిలా రాష్ట్రానికి ఒక ప్రణాళికలో కుల గణన సర్వే జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఎన్యుమరేటర్ లకు విధిగా సమాచారం ఇవ్వాలని కోరారు. అనారోగ్యానికి ఎక్స్ రే ఎలాగో సమాజానికి సర్వే కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఎంత జనాభాకు ఎన్ని రేషన్ షాపులు ఉండాలో ఆర్డీవో వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని లబ్ధిదారుల ఎంపిక ప్రజల మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇళ్లకు భూమి పూజ చేసే కార్యక్రమం జరగనుందని అన్ని కులాలతో సమానంగా బుడగ జంగాల కమ్యూనిటీ హాల్ కు రూ. 45 లక్షలు ఇచ్చి వాటికి ఇందిరమ్మ కమిటీ హాల్ అని నామకరణం చేస్తామన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు సంపాదించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మండలంలోని బల్లు నాయక్ తండా కు చెందిన లావుడ్య దేవి కి హాస్టల్ ఖర్చుల నిమిత్తం రూ. 1,50,000 చెక్కును మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్మన్ అనిత రెడ్డి, సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed