- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పర్యటనపై ఫ్లకార్డులతో నిరసనలు
దిశ, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవన కార్యక్రమం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో మూసీ నది(visit to Musi) పరివాహక ప్రాంతంలో శుక్రవారం చేపట్టనున్న పాదయాత్రకు ముందే ఆ ప్రాంత రైతులు పలువురు ఫ్ల కార్డులతో నిరనస వ్యక్తం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్గాలు పోస్టు చేశాయి. "రైతు బంధు రాలేదు - నువ్వు రాకున్నా ఫర్వాలేదు" అంటూ, "మూసీతో మురిపించకు - రుణమాఫీతో కరుణించు" అంటూ రేవంత్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు.
అయితే ఆ రైతుల ఫ్ల కార్డుల ప్రదర్శన వెనుక బీఆర్ఎస్ పార్టీ, దాని సోషల్ మీడియా ప్రమేయం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంపై ఏదో ఒక వివాదాన్ని సృష్టించి రాజకీయ లబ్ధీ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, అలాంటి చర్యలను చూస్తు సహించేది లేదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్రకు పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.