ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు

by Sridhar Babu |
ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ. 110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రోడ్డు నిర్మాణ ఆవశ్యకతపై పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే జాతరలలో ఒకటి అయిన కురుమూర్తి దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా ఈ ఘాట్ రోడ్డు నిర్మాణ ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

ఇటీవలే 34 లక్షల రూపాయల వ్యయంతో శాశ్వత తాగునీటి సౌకర్యాలను కల్పించడంతోపాటు ప్రస్తుతం 11 0 కోట్ల రూపాయలను ఘాటు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతుండడంతో భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed