- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారం రోజుల్లో సీఎంను కలుద్దాం
దిశ, భిక్కనూరు : సమస్యలపై వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సెంట్రల్ గ్రంథాలయంలో, రాష్ట్రంలోని వివిధ జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలపై నేరుగా సీఎంను కలిసి పరిష్కరించాలని కోరుదామన్నారు. అంతేకాకుండా గ్రంథాలయాల్లో నెలకొన్న స్టాఫ్ కొరతతో పాటు ఇతరాత్ర సమస్యలపై వారం రోజుల్లో అపాయింట్ మెంట్ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డితో కులంకశంగా చర్చిద్దామన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లుగా సీఎం మీకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. గ్రంథాలయాలకు వచ్చే పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ను శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డితో పాటు, వివిధ జిల్లాల చైర్మన్లు పాల్గొన్నారు.