- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 28 నుంచి 30 వరకు సైన్స్ ఫెయిర్
దిశ, సిద్దిపేట అర్బన్ : జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, 2024-25 ఇన్ స్పైర్ అవార్డుల ప్రాజెక్టుల ప్రదర్శన ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్య అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారులను కన్వీనర్లుగా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను కో కన్వీనర్లుగా నియమించినట్లు తెలిపారు. ఇన్ స్పైర్ అవార్డులకు గాను ఎంపికైన 188 మంది విద్యార్థులు గత సంవత్సరం నామినేషన్ చేసుకున్న అంశాల్లో ఎటువంటి మార్పు లేకుండా తమ ప్రదర్శనలతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశాల నమూనాలతో హాజరుకావాలని అన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.