Bandla Ganesh: 'ఆది పురుష్' చిత్రానికి దండం పెట్టిన బండ్ల గణేష్!

by Satheesh |   ( Updated:2024-12-14 14:58:26.0  )
Bandla Ganesh: ఆది పురుష్ చిత్రానికి దండం పెట్టిన బండ్ల గణేష్!
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి వ‌రుస క్రేజీ ప్రాజెక్టులతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న హీరో డార్లింగ్ ప్రభాస్‌. ఈయ‌న టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం 'ఆది పురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నా ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు మొద‌ల‌య్యాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్రక‌టించేశారు. ఈ ప్రణాళికలో భాగంగానే అక్టోబర్‌లో టీజర్ విడుదల చేశారు. అయినప్పటికి టీజర్ అనుకున్నంతగా లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అసలు నీకు రామాయణం తెలుసా? ఇష్టం వచ్చినట్లు పౌరాణిక పాత్రలు చూపిస్తారా? అని ఓం రౌత్‌ని తిట్టిపోశారు.

ఈ మూవీలో తగు మార్పులు చేయకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మరో వంద కోట్ల బడ్జెట్ కేటాయించి మెరుగైన అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో 'ఆదిపురుష్' మూవీ మరింత ఆలస్యం కానుందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ దండం ఎమోజీ పోస్ట్ చేశాడు. అయితే ఈ దండం పెట్టడం వెనకాల పరమార్దం ఏమిటి? 'మీకు దండం త్వరగా మూవీ విడుదల చేయండి' అని చెప్పాడా లేక.. 'మీకు దండం మంచి నిర్ణయం తీసుకున్నారు. లేటైనా పర్లేదు మంచి అవుట్ ఫుట్‌తో రండి' అని చెప్పాడా? అంటూ అభిమానులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed