అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు.. జీవితకు Bandla Ganesh కౌంటర్

by Satheesh |   ( Updated:2022-08-26 15:29:19.0  )
అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు.. జీవితకు Bandla Ganesh  కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పబ్‌ల్లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయంటూ యాక్టర్, బీజేపీ నాయకురాలు జీవిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీవిత వ్యాఖ్యలకు నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ''లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు.. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా'' అంటూ సెటైర్ వేశాడు. అంతేకాకుండా జీవిత, రాజశేఖర్ దంపతులు వివిధ పార్టీల్లో చేరిన సందర్భాల్లోని ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఇంకా జనసేన పార్టీ కూడా మిగిలి ఉందని కామెంట్ చేయడంతో.. దండం ఎమోజీతో వద్దు అనే విధంగా బండ్ల రిప్లే ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఎమోషనలైన Sreenu Vaitla.. కారణం ఏమిటంటే ?

Advertisement

Next Story