- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోసిడీకే అంటూ గర్జించిన బాలయ్య.. పొలిటికల్ హీట్ పెంచిన టీజర్
దిశ, సినిమా : నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజంటే నందమూరి అభిమానులకు పండగే. నేడు ఆయన 62వ పడిలోకి అడుగుపెడుతున్నందున ఆనందోత్సవాల మధ్య సెలబ్రేట్ చేసుకునేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు బాలయ్య. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తాను హీరోగా రూపొందుతున్న #NBK107 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటేనే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు పెట్టింది పేరు కాగా.. ఈ టీజర్‌లో ఆయన చెప్పిన డైలాగ్స్ రాజకీయ ప్రత్యర్థులకు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. ప్రత్యేకించి 'మీ GO గవర్నమెంట్ ఆర్డర్.. నా GO గాడ్స్ ఆర్డర్' అనే డైలాగ్‌తో పాటు ఆయన ఉపయోగించిన 'బోసిడీకే' పదంపై పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం పర్టిక్యులర్ లైన్స్ సినిమా కథకు సంబంధించినవేనని, రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు. కాగా ఫ్యాన్స్ ఆశించిన కమర్షియల్ హంగులన్నీ ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది.