Nandamuri Balakrishna - Gopichand Malineni సినిమాకు 'జై బాలయ్య' టైటిల్‌?

by Hamsa |   ( Updated:2022-09-06 13:44:04.0  )
Nandamuri Balakrishna - Gopichand Malineni  సినిమాకు జై బాలయ్య టైటిల్‌?
X

దిశ,సినిమా: నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. షూటింగ్ మొదలైన కొత్తలో 'పెద్దాయన', 'రెడ్డి గారు', 'అన్న గారు' అనే టైటిల్స్‌ను పరిగణలోకి తీసుకున్న మేకర్స్.. చివరగా 'జై బాలయ్య' అనే పేరునే ఫైనల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీకి 'జై బాలయ్య' అనే స్లోగన్‌ని టైటిల్‌గా ఫిక్స్ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే చర్చ నడుస్తుండగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read : 'టైగర్ నాగేశ్వరరావు'.. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలుస్తుంది

Advertisement

Next Story