పేకాట మత్తులో Bala Krishna పోగొట్టుకున్నది తెలిస్తే షాక్ అవుతారు..!

by Hajipasha |   ( Updated:2022-11-17 14:55:34.0  )
పేకాట మత్తులో Bala Krishna  పోగొట్టుకున్నది తెలిస్తే షాక్ అవుతారు..!
X

దిశ, సినిమా: నటసింహం నందమూరి బాలకృష్ణకు పేకాట ఆడే అలవాటు ఉందని చెప్పుకొచ్చాడు దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి. తాజా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఓ సంఘటన గురించి తెలిపాడు. 'నేను బాలకృష్ణ నటించిన 'టాప్ హీరో' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైమ్‌లో బాలయ్య నాతో చాలా సరదాగా ఉండేవారు. అలాగే మూవీ షూటింగ్ టైమ్‌లో బాలకృష్ణ నన్ను మీకు పేకాట ఆడటం వచ్చా అని అడిగాడు. వచ్చు అని అనగానే వెంటనే ఆట మొదలు పెట్టారు. అలా పేకాట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇక కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను సార్ అని ఎంత చెప్పినా వినలేదు. నువ్వు ఆడాల్సిందేనని పట్టుబట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ విషయం తెలిసిన నెటిజన్స్ 'బాలకృష్ణ ఇంకా పేకాట మర్చిపోలేదా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కుమార్తె ఎంట్రీపై మంత్రి రోజా రియాక్షన్

Advertisement

Next Story

Most Viewed