బాలయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన శ్రీలీల.. ఎంత ఘోరం అంటే?

by samatah |   ( Updated:2023-03-08 10:15:10.0  )
బాలయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన శ్రీలీల.. ఎంత ఘోరం అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ అమ్మడకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నందమూరి నటసింహం బాలయ్యబాబుకే అమ్మడు షాకిచ్చిందంట.

అసలేమైదంటే? శ్రీలీల NBK 108 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించబోతుంది. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు గతంలో అనిల్ రావుపూడి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, మరి కొద్ది రోజుల్లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో బాలకృష్ణ, శ్రీలీల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని అనిల్ రావుపూడి భావించాడంట. దీంతో శ్రీలీలలను డేట్స్ అడగగా, ఆమె డేట్స్ లేవంటూ మేకర్స్‌కు వెనకకు పంపి షాకిచ్చిందంట. ఓ అగ్రహీరో మూవీకి డేట్స్ ఖాళీలేవడం ఆమెకు ఎంత పొగరు, ఇదెంత ఘోరం అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed