మోక్షజ్ఙ సినీ ఎంట్రీ పై కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ

by Mahesh |   ( Updated:2024-09-02 14:58:16.0  )
మోక్షజ్ఙ సినీ ఎంట్రీ పై కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి కుటుంబంలో ఇప్పటికే మూడోతరం యువనాయకులు హీరోలుగా పరిచయమై స్టార్ హీరోలుగా ఎదిగారు. కానీ బాలకృష్ణ ఇంటి నుంచి ఒక్కరు కూడా సినిమాల్లోకి రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై బాలయ్య స్పందించారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తన కొడుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని.. దీనికోసం తగిన వర్క్ జరుగుతుందని.. మరో మూడు నెలల్లో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని బాలయ్య చెప్పుకొచ్చారు. అలాగే తన కొడుగ్గా వస్తున్న మోక్షజ్ఙ పై భారీ అంచనాలు నెలకొన్నాయని.. సినిమా కూడా తీయకుండానే స్టార్ అయిపోయాడని అన్నారు. అలాగే మోక్షజ్ఙ ఎంట్రీ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నాయని.. హీరోగా లాంచ్ చేసే విషయంపై తనకు ఎలాంటి టెన్షన్ లేదని ఈ సందర్భంగా బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో నందమూరి అభిమానుల్లో సందడి మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed