ప్రభాస్ వల్లే నా కెరీర్ ముగిసిపోయింది.. బలగం దర్శకుడు వేణు సంచలన వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2023-04-08 08:50:09.0  )
ప్రభాస్ వల్లే నా కెరీర్ ముగిసిపోయింది.. బలగం దర్శకుడు వేణు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం మూవీతో స్టార్ డైరెక్టర్‌కు తగ్గ పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ఆయన వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తాను చిత్ర పరిశ్రమలో పడిన కష్టాలు, నష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తన కెరీర్ ముగిసి పోవడానికి కారణం ప్రభాసే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. సినిమా నన్ను మోసం చేయదని నమ్మాను. గతంలో కొన్ని సినిమాలకు నేను పనిచేసినా గుర్తింపు రాలేదు. కేవలం నన్ను ఒక కమెడియన్ గా మాత్రమే చూశారు. ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించినా నాకు అంతగా గుర్తింపు రాలేదు, ఇకపోతే ప్రభాస్ వల్లే నా కెరియర్ ముగిసిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..ప్రభాస్ నటించిన మున్నా మంచి సక్సెస్ అవుతుందని చాలా కలలు కన్నా కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. నేను కెరీర్ లో చాలా ఇబ్బందులు పడ్డా, అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు నేనే డైరెక్టర్‌గా మారి సినిమా తీయడం, అది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను నా దైవంగా భావించే చిరంజీవి, నా సినిమా చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వేణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more:

చైతన్య, నిహారికను కలిపిన చిరంజీవి.. విడాకులు క్యాన్సిల్

Advertisement

Next Story

Most Viewed