సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇకపై మహేష్ బాబుని చూడలేరు

by Kavitha |   ( Updated:2024-02-22 07:50:44.0  )
సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఇకపై మహేష్ బాబుని చూడలేరు
X

దిశ, సినిమా: టాలీవుడ్ మిగతా స్టార్ దర్శకులతో లతో పోలిస్తే SS రాజమౌళి డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్స్‌ను కూడా మార్చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కథకు తగ్గటుగా హీరో ని మలుచుకుంటారు. ఇక జక్కన్న తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్‌గా వేట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి.. మహేష్‌‌కి రూల్ పెట్టారట. ఇక నుంచి ఎలాంటి ఈవెంట్స్ కు కానీ, మూవీ ఫంక్షన్స్ కు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేశాడట రాజమౌళి. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇకపై మహేష్ బాబు పబ్లిక్‌గా కనిపించకూడదని ఎస్ఎస్ రాజమౌళి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే మహేష్ బాబుకు రాజమౌళి ఎందుకు ఆ కండిషన్ పెట్టాడు అంటే.. ఆయన కొత్త గెటప్ ఎలా ఉంటుందో జనాలకు తెలియకూడదు. అందుకే మహేష్ బాబుని పబ్లిక్‌గా కనిపించవద్దని రాజమౌళి రూల్ పెట్టాడట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Read More..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పనికి మాలిన వాడంటూ.. హీరోయిన్ సంచలన పోస్ట్

Advertisement

Next Story

Most Viewed