Pathaan controversy :షారుఖ్ దినకర్మ చేసిన హిందూ మతపెద్ద.. తీరు మార్చుకోవాలని హెచ్చరిక

by Prasanna |   ( Updated:2022-12-27 08:17:13.0  )
Pathaan controversy :షారుఖ్ దినకర్మ చేసిన హిందూ మతపెద్ద.. తీరు మార్చుకోవాలని హెచ్చరిక
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణేల అప్‌కమింగ్ మూవీ 'పఠాన్‌'పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 'బేషరమ్ రంగ్' పాటలో దీపిక ధరించిన బికినీ పై కొంతమంది హిందుత్వ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న మహంత్ రామచంద్ర దాస్ పరమహంస..ఇంతకు ముందు షారుఖ్‌ను సజీవ దహనం చేస్తానని హెచ్చరించగా, ప్రస్తుతం నడిరోడ్డుపై పదమూడు రోజుల దినకర్మ కూడా చేశాడు. బాలీవుడ్ హీరో తన సినిమాల ద్వారా ప్రచారం చేస్తున్న " జిహాద్ " కు ఈ విధంగా ముగింపు పలుకుతున్నానని చెప్పాడు. షారుఖ్ సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నాడని. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఫైర్ అయ్యాడు.

Also Read...

Unstoppable Season 2 : ఒకే వేదికపై పవర్ స్టార్, నటసింహం.. గెటప్ అదుర్స్

Advertisement

Next Story

Most Viewed