'అవతార్ 2' 12 డేస్ కలెక్షన్స్ రూ. 8,277 కోట్ల !

by Prasanna |   ( Updated:2022-12-28 09:25:43.0  )
అవతార్ 2   12 డేస్ కలెక్షన్స్ రూ. 8,277 కోట్ల !
X

దిశ, సినిమా : డిసెంబర్ 16న రిలీజ్ అయిన 'అవతార్ 2' థియేటర్లో బీభత్సం సృష్టిస్తుంది. ఈ సినిమాకు మొదటి వారం లోనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు ఇండియాలో ఫస్ట్ వీకెండ్‌లో అంతగా ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి వారంలో రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొత్తానికి రూ. 8,277 కోట్ల కలెక్షన్‌తో, హాలీవుడ్ బాక్సాఫీస్‌ను చిత్తు చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరాన్ . ఇది కేవలం 12 రోజుల్లోనే సాధించింది. ఈ సందర్భంగా కామెరాన్ మాట్లాడుతూ సినిమాలో హింస పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''నేను వాస్తవానికి గన్‌ప్లే యాక్షన్‌ను లక్ష్యంగా చేసుకుని మూవీ‌లో 10 నిమిషాలు తగ్గించాను, హింస, చర్య ఒకటే, మీరు వాటిని ఎలా చూస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పటి వరకు తీసిన కొన్ని సినిమాలు వెనక్కి తిరిగి చూసుకున్నాను, ఆ సినిమాని ఇప్పుడు తీయ గలనో లేదో నాకు తెలియదు'' అని కామెరాన్ వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి : డైరెక్టర్స్ ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Advertisement

Next Story