టాలీవుడ్ దర్శకులంతా నా ప్రైవేట్ పార్ట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు: ఇలియానా

by Prasanna |   ( Updated:2023-09-12 06:28:19.0  )
టాలీవుడ్ దర్శకులంతా నా ప్రైవేట్ పార్ట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు: ఇలియానా
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు వేరొక ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తూ దర్శకులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేసిన చాలా మంది హీరోయిన్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. వారిలో రష్మిక మందన్నా, పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వంటి వాళ్లు కూడా ఉన్నారు.

అయితే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇదే వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించించింది. కాగా ఇటీవల అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన కామెంట్స్ చేసింది. ‘టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మీరు.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర లేదు ఎందుకు? అని ప్రశ్నించగా దీనికి సమాధానం ఇచ్చిన ఇలియానా ‘తెలుగు డైరెక్టర్‌లు అందరూ నా పాత్ర గురించి కాకుండా నా నడుముని ఎలాంటి యాంగిల్స్‌లో చూపించాలి. ఎన్ని షేడ్స్‌లో నడుము కనిపిస్తే బాగుంటుందనే దానిపైనే ఫోకస్ చేశారు. కానీ నా పాత్ర గురించి ఆలోచించలేదు. నా నడుము పైన ఉన్న దృష్టి నాకు ఇచ్చే క్యారెక్టర్ మీద లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం నటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read More: Bigg Boss 7 Telugu : 'కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడకొచ్చి ఏమి చేస్తున్నావ్' అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక

Advertisement

Next Story