నాకు ఆ ఇద్దరు భార్యలతో సంబంధం లేదు.. పాపులర్ సింగర్ స్టేట్మెంట్

by Sujitha Rachapalli |
నాకు ఆ ఇద్దరు భార్యలతో సంబంధం లేదు.. పాపులర్ సింగర్ స్టేట్మెంట్
X

దిశ, సినిమా: యూట్యూబర్ సందీప్ తన పేరును అర్మాన్ మాలిక్ గా మార్చుకున్నాడు. ఇద్దరు భార్యలు ఉన్న ఆయన వారితో కలిసి ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ 3కి వెళ్లాడు. ఈ క్రమంలో కొంత నెగెటివిటీ ఎదుర్కొంటున్నాడు. ఒకేసారి ఇద్దరిని ఎలా పెళ్లి చేసుకుంటాడని.. పైగా సెకండ్ వైఫ్ ను చూసిన క్షణంలోనే ప్రేమించానని, వారంలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం ఫన్నీగా ఉందంటున్నారు. ఇక హౌజ్ లో శృతి మించిన రొమాన్స్ ను చూడలేక పోతున్నామని తిడుతున్నారు. అయితే కొందరు ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ అనుకుని ఆయనను తిట్టిపోస్తున్నారు. ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తనకు, ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం చెప్పాడు. ఇద్దరు వైఫ్స్ ఉన్నారని తనను ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తుండటం బాధగా ఉందన్నారు. దీనివల్ల తన పరువు పోతుందని.. అభిమానించేవారు కూడా తప్పుపడుతున్నారని బాధపడ్డారు. ఈ సందర్భంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడుగా ఉంటారని నమ్ముతున్నానని, సపోర్ట్ చేయాలని కోరారు. పేరు మార్చుకోవడం ఆయన హక్కు అని దానికి ఏం చేయలేమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed