జాన్వీ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన అర్జున్

by Prasanna |   ( Updated:2023-01-18 07:26:24.0  )
జాన్వీ క్యారెక్టర్‌పై షాకింగ్  కామెంట్స్ చేసిన అర్జున్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన చెల్లెలు జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'కుత్తే' ఇటీవలే విడుదలై పాజిటీవ్ టాక్‌తో దూసూకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తున్న హీరో.. తాజాగా ఓ కార్యక్రమంలో తన ప్రేయసి మలైకాతో తనకున్న అనుబంధంతోపాటు సవతి చెల్లెలు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'జాన్వీకి అభద్రతాభావం ఎక్కువ. ఎల్లప్పుడూ భయం, ఆందోళన కలిగివుంటుంది. తన సామర్థ్యంపై తనకే నమ్మకం ఉండదు. ఒక స్టార్ కూతురనే విషయం మరిచిపోయి చాలా సాధారణంగా ఉంటుంది. నిజానికి అలా ఉండటమే మంచింది. అందుకే ఆమె సినిమాలు ఎంపిక చేసుకునే విధానం బాగుంటుంది. నిరంతరం సరికొత్త కథ, క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాడానికి ఆరాటపడుతుంది' అంటూ పలు ఆంశాలను ప్రస్తావించాడు.

Also Read....

నాకో బాయ్ ఫ్రెండ్ కావాలి : సురేఖవాణి.. అది పొడుగ్గా, బాగా ఉండాలని కండిషన్

Advertisement

Next Story