Naga Chaitanya: 4 నిమిషాల కోసం రూ.3 కోట్లు పెడుతున్నారా.. నాగ చైతన్య రేంజ్ పెరిగిందిగా..!

by Prasanna |   ( Updated:2024-08-27 15:26:03.0  )
Naga Chaitanya: 4 నిమిషాల కోసం రూ.3 కోట్లు పెడుతున్నారా.. నాగ చైతన్య రేంజ్ పెరిగిందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్: నాగ చైతన్య కెరీర్లో తండేల్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న కార్తికేయ2 మూవీకి నేషనల్ అవార్డు రావడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్ భారీ హైప్ ని క్రియోట్ చేసాయి. ఈ సారి నాగ చైతన్య పెద్ద హిట్ అందుకుంటారనే ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ఈ మూవీలో కేవలం ఒక్క పాటకే.. రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ పాటను షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ హైదరాబాద్ అవుట్ కట్స్‌లో ఓ భారీ సెట్ కుడా వేసారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే కథ అవ్వడంతో అక్కడ జాతర్లలో వేషాలు వేసినా శ్రీకాకుళం కళాకారులు 65మందిని తీసుకొచ్చారని తెలిసిన సమాచారం.

Advertisement

Next Story

Most Viewed