లెస్బియన్ సినిమాకు రెహమాన్ సంగీతం.. మానవత్వం ఉండాలంటూ

by Prasanna |   ( Updated:2023-04-24 08:53:08.0  )
లెస్బియన్ సినిమాకు రెహమాన్ సంగీతం.. మానవత్వం ఉండాలంటూ
X

దిశ, సినిమా : ‘ఫైర్’ చిత్రానికి సంగీతం అందించడంపై ఏఆర్ రెహమాన్ వాల్యూయెబుల్ కామెంట్స్ చేశాడు. ఇస్మత్ చుగ్తాయ్ రాసిన చిన్న కథ ‘లిహాఫ్’ (ది క్విల్ట్) ఆధారంగా రూపొందించబడిన ఈ లెస్బియన్ మూవీని 1998లో ఇండియాలో విడుదల చేయగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అయితే రీసెంట్‌గా ఓ సమావేశంలో ఈ సినిమా గురించి మాట్లాడిన రెహమాన్.. ‘ఇదొక లెస్బియన్ చిత్రం. నా విలువలకు సంబంధించినది కాదు. కానీ మానవత్వంతో మద్దతుగా నిలబడ్డాను. ఎందుకంటే ఎవరైనా అణిచివేతకు గురైనప్పుడు, మూలకు నెట్టివేయబడినపుడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అందుకే ఈ సినిమా చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది’ అని అన్నాడు. ఇక 1996లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో విడుదలైన మూవీలో పాటలు లేవు. కానీ 16 ఇన్‌స్ట్రుమెంటల్ ట్రాక్‌లు ఉండగా 14 ఏఆర్ రెహమాన్ స్వరపరచడం విశేషం..

Also Read..

రణ్‌వీర్ బిహేవియర్ మాకు నచ్చలేదు.. రణ్‌బీర్ మంచివాడు

Advertisement

Next Story