హిందీ కాదు.. తమిళంలో మాట్లాడండి: భార్య సైరాను కోరిన రెహమాన్

by sudharani |   ( Updated:2023-04-27 15:40:17.0  )
హిందీ కాదు.. తమిళంలో మాట్లాడండి: భార్య సైరాను కోరిన రెహమాన్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ అవార్డ్స్ షోకు సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్, సైరా భాను దంపతులు హాజరయ్యారు. అయితే ఈ షోలో యాంకర్ సైరాను మాట్లాడాల్సిందిగా వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రెహమాన్ సాధించిన విజయాలపై కొన్ని మాటలు మాట్లాడండి అని సైరాను అడిగారు. దీంతో ఆమెను హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడమని రెహమాన్ సూచించాడు.

తమిళంలోనే మొదలుపెట్టిన ఆమె.. ‘అందరికీ శుభ సాయంత్రం. నేను తమిళంలో అనర్గళంగా మాట్లాడలేను. దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే రెహమాన్ వాయిస్ నాకు చాలా ఇష్టం. నేను అతని గొంతుకు ఎప్పుడో ప్రేమలో పడ్డాను. అది మాత్రం నేను చెప్పగలను’ అని తెలిపింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ‘రెహమాన్ హిందీకి వ్యతిరేకం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisement

Next Story