- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నప్ప కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన ఇంకో మూవీ కూడా ఉందని తెలుసా..?
దిశ, సినిమా: బాహుబలి మూవీతో ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ మూవీ ఎంతటి గొప్ప విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ‘కల్కి’ (KALKI 2898 AD) అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత డార్లింగ్ చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాడు. వాటిలో కన్నప్ప కూడా ఒకటి.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఆ సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
10 ఏళ్ల క్రితం హిందీలో యాక్షన్ జాక్సన్ అనే సినిమా విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా కూడా నటించారు. ఈ చిత్రంలోని పంజాబీ మస్త్‌లో సాంగ్ లో ప్రభాస్ కూడా కనిపిస్తాడు. హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి రెండు స్టెప్పులు కూడా వేసాడు. అయితే, ఈ మూవీ రిలీజ్ ముందు వరకు కూడా ప్రభాస్ అతిధి పాత్ర చేశాడన్నా విషయం మేకర్స్ ప్రకటించలేదు.
విడుదలైన తర్వాత, ఈ పాటలో ప్రభాస్ కనిపించడం చూసి ప్రేక్షకుల కూడా ఆశ్చర్యపోయారు. చాలా ఏళ్ల తర్వాత డార్లింగ్ మరోసారి కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ మూవీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.