యాంకర్‌కు ఇచ్చిపడేసిన అనుష్క.. సైజ్ గురించి సరిగ్గా మాట్లాడమని ఫైర్

by Sujitha Rachapalli |
యాంకర్‌కు ఇచ్చిపడేసిన అనుష్క.. సైజ్ గురించి సరిగ్గా మాట్లాడమని ఫైర్
X

దిశ, సినిమా: లేడీ ఓరియెంటెడ్ మూవీలలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క శెట్టి... సైజ్ జీరో సినిమా చేశాక లావు అయిపోయింది. బాహుబలి 2లో అదే లుక్ తో కనిపించినా మెస్మరైజ్ చేసింది. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి చీర కట్టుకున్న ఆమె.. ఈ చీర తనకు రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలో సిల్లీ ప్రశ్నలు అడిగిన యాంకర్... XXX, XX కూడా దొరుకుతాయా అంటూ సైజ్ పై కామెంట్స్ చేశాడు. వీటన్నింటికీ వివరణ ఇచ్చిన బ్యూటీ.. చివరకు కొంచెం ఆరోగ్యకరంగా మాట్లాడాలని యాంకర్ కు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. స్వీటీ ఇన్నర్ బ్యూటీకి ఫిదా అయిపోయామని అంటున్నారు అభిమానులు.

కాగా అనుష్క.. ' మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ' సినిమా తర్వాత రీసెంట్ గా మరో ప్రాజెక్టు ప్రకటించింది. ప్రస్తుతం అదే మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక పాన్ ఇండియా సినిమా బాహుబలితో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ... ఇకపై ఉమెన్ సెంట్రిక్ మూవీస్ మాత్రమే చేయబోతుందనే టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సత్తా తనకు ఉండటమే ఇందుకు కారణం.

Advertisement

Next Story

Most Viewed