ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు 'ఆస్కార్ అవార్డ్' చాన్స్.!

by Hajipasha |   ( Updated:2022-08-16 13:37:45.0  )
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ చాన్స్.!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంతో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఎస్ఎస్‌ను ప్రశంసించారు. 'దోబారా' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ల జాబితాలోకి వచ్చే అవకాశం 99 శాతం ఉందని తెలిపాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రజల హృదయాలను గెలుచుకుని, హాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. కాగా.. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్‌లో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'దోబారా' సినిమా ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది.

మూసుకోండి అంటూ.. 'కార్తికేయ 2'ను అడ్డుకోవడంపై దిల్ రాజు ఘాటు వ్యాఖ్యలు..

Advertisement

Next Story