- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anupama: అలాంటి సినిమాలు చేయడం బోరింగ్.. కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటానంటూ అనుపమ కామెంట్స్
దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. తెలుగులో కార్తికేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ ఏడాది టిల్లు స్వ్కేర్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రజెంట్ ఈ అమ్మడు పరదా, బైసన్ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ సౌకర్యంగా ఉంది కదా అని చేసిన పాత్రలే చేయాలని ఓ గిరి గీసుకుని ఆ జోన్‌లోనే నటించడం బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటాను. ఏ పాత్రలో చేసినా అందులో నటిగా నాకు సవాల్ విసిరే సీన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాను. సెట్లో డైరెక్టర్ రీటేక్స్ అడిగినప్పుడే నాకు చాలా నచ్చుతుంది. బాగా చేశావని ప్రశంసలు కురిపించడం కంటే రీటేక్ అనే పదమే నా చెవులకు ఇంపుగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అనుపమ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.