సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్స్

by Anjali |
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ప్రేమ.. పెళ్లిళ్లు.. ఏడాది, 2 ఏళ్లు గడవకముందే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సోదరుడు.. నటుడు రాజీవ్ అండ్ బుల్లితెర నటి చారు అసోపా 2019లో ప్రేమ వివాహం చేసుకుని ఆడపిల్లకు జన్మనిచ్చారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకోని కోర్టును ఆశ్రయించారు. తాజాగా రాజీవ్ ‘‘ మేం విడిపోయిన మా ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా కుమార్తెకు ఎల్లప్పుడూ అమ్మానాన్నల్లాగే ఉంటాం.’’ అంటూ తను ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ‘‘ మీ సినీ పరిశ్రమ వారికి విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు కదా?’’అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story