- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
హార్దిక్ పాండ్యా, నటాషా డివోర్స్ రూమర్స్..వీరి బాటలోనే మరో క్రికేటర్ జంట!
దిశ, సినిమా : ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కొనసాగుతుంది. చాలా మంది సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడంటూ అనేక వార్తలొస్తున్నాయి. వారు విడిపోయారున, నటాషాకి భరణంగా తన ఆస్తిలో 70 శాతం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య, ధనశ్రీ వర్మపై ఈ డివోర్స్ ఎఫెక్ట్ పడింది. ఆమె తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈమె తన ఇన్ స్టా అకౌంట్లో తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్లీగా ఉన్న ఫొటోలు, సెల్ఫీలు పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.దీంతో ఆమె ఫోటోస్ పై ఒకొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా కొంత మంది చాహల్‌తో ఆమె రిలేషన్ పై కామెంట్స్ చేస్తూ.. హార్దిక్ పాండ్యా, నటాసాలానే మీ బంధంలో సమస్యలు ఏర్పడుతాయి. భవిష్యత్తులో మీకు కూడా విభేదాలు తప్పవు అంటూ జోస్యం చెప్పారు. ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.