- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలీవుడ్లో మరో బ్రేకప్ - ఐదేళ్ల బంధానికి బై బై చెప్పుకున్న మలైకా, అర్జున్..
దిశ, సినిమా: ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకుని విడిపోయి చెప్పినంత సులువు కాదంటూ నచ్చ చెబుతున్నారు. ముఖ్యంగా సినీ, టీవీ ఇండస్ట్రీలో అయితే తరచూ విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే బాలీవుడ్లో మరో జంట బ్రేకప్ చెప్పుకుందట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా-అర్జున్ కపూర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న వీరు 2018లో రిలేషన్‌పై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారంటూ బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ జంట సన్నిహిత వర్గాలు కూడా అదే చెబుతున్నాయి.
కాగా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ అయినా, ఎలాంటి మూవీ ఈవెంట్ అయినా అర్జున్ కపూర్-మలైకా జంటగా హాజరవుతారు. తమ రిలేషన్‌ని ఆఫీషియల్ చేసిన తర్వాత తరచూ ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకున్న ఈ జంట అయితే కొద్ది రోజులుగా ఈ జంట గప్‌చుప్‌గా ఉంటుంది. ఎప్పుడు జంటగా కనిపించేవారు ఇప్పుడు సింగిల్ గా కనిపిస్తున్నారు. అర్జున్ కపూర్ మీడియాకు దూరంగా ఉంటున్న.. మలైకా తరచూ సింగిల్‌గానే కనిపిస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి బ్రేకప్ చెప్పుకున్నారంటూ ప్రచారం మొదలైంది.
కానీ, చాలామంది దీన్ని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారనేది నిజమేనంటూ ఇండస్ట్రీ వర్గాలు కన్ఫాం చేస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అర్జున్-మలైకా విడిపోయారనే వార్తలను కన్ఫామ్ చేశారట. అయితే మలైకా, అర్జున్‌లు మాత్రం తమ బ్రేకప్ గురించి బయటకు చెప్పేందుకు వారు సముఖత చూపటం లేదు. ఎందుకంటే దీనిపై అందరూ చర్చించుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకే ఈ విషయంలో వారు మౌనంగా ఉంటున్నారు" అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై ఈ అర్జున్, మలైకాల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.