- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Daughter: పెళ్లయినా.. తల్లి కుటుంబంలో సభ్యురాలే
దిశ, నేషనల్ బ్యూరో: కారుణ్య నియామకా(compassionate appointment)ల్లో కొడుకు, కూతురు(Daughter)కు సమాన హక్కులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లినా కుమార్తె.. తల్లి కుటుంబంలో సభ్యురాలి హోదాను కోల్పోదని వివరించింది. పెళ్లి చేసుకుని వెళ్లినంత మాత్రానా కారుణ్య నియామకాల్లో ఆమెకు అవకాశం ఉండదనడం సరికాదని తెలిపింది. అదే పెళ్లి చేసుకున్న కొడుకుకు మాత్రం ఎందుకు ఎక్కువ అవకాశమివ్వాలని జస్టిస్ కే మన్మధ రావు ప్రశ్నించారు. అది కచ్చితంగా వివక్షే అవుతుందని స్పష్టం చేశారు.
గుడిలో స్వీపర్‌గా పని చేసిన వ్యక్తి 2013లో మరణించడంతో ఆయన బిడ్డ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకుంది. భర్త తనను వదిలివెళ్లిపోయాడని పేర్కొంది. భర్తతో విడాకుల పత్రాన్ని సమర్పించాలని అధికారులు అడిగారు. డైవర్స్ సర్టిఫికేట్ పొందడానికి తన భర్త ఎక్కడున్నాడో కనుక్కోలేకున్నానని పేర్కొంటూ 2021లో మళ్లీ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు పెట్టుకుంది. అధికారులు స్పందించకపోవడంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకున్న బిడ్డ.. మరణించిన ఉద్యోగిపై ఆధారపడితే, ఆ ఉద్యోగి భాగస్వామి, పిల్లలు అభ్యంతరం చెప్పకుంటే కారుణ్యనియామకానికి అర్హురాలని 1999లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నదని కోర్టులో ప్రతివాదులు పేర్కొన్నారు. పెళ్లయిన కొడుకుతో సమానంగా పెళ్లయిన బిడ్డకు అవకాశం ఇవ్వకపోవడం తప్పు అని, చట్ట వ్యతిరేకం అని కోర్టు నిర్ణయానికి వచ్చింది. స్వీపర్ లేదా మరేదైనా సరిపడ ఉద్యోగావకాశాన్ని ఆమెకు అందించాలని అధికారులను ఆదేశించింది.