- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hylo open :సెమీస్‌కు దూసుకెళ్లిన యువ సంచలనం మాళవిక
దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ సంచలనం మాళవిక బాన్సోద్ దూకుడు కొనసాగుతోంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మాళవిక 21-15, 21-17 తేడాతో వియత్నం క్రీడాకారిణి న్గుయెన్ తుయ్ లిన్‌పై విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి మాళవిక గట్టి పోటీ ఎదుర్కొంది. అయినప్పటికీ ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించింది. మరోవైపు, టోర్నీలో తెలుగమ్మాయి రష్మిక శ్రీ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన జూలీ డావల్ జాకోబ్నెన్ చేతిలో 21-12, 21-17 తేడాతో ఓడి ఇంటిదారిపట్టింది. ఇక, మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు ఆయుశ్ శెట్టి కూడా సెమీస్‌కు దూసుకెళ్లాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన క్వార్టర్స్‌లో కల్లె కోల్జోనెన్(ఫిన్లాండ్)ను 21-18, 21-18 తేడాతో మట్టికరిపించాడు.