పెళ్లి పీటలెక్కబోతున్న అంజలి.. ఆనందంలో ఫ్యాన్స్

by samatah |
పెళ్లి పీటలెక్కబోతున్న అంజలి.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జర్ని, బలుపు లాంటి కొన్ని సినిమాలే తప్ప అంజలికి టాలీవుడ్‌లో ఆశించినన్ని అవకాశాలు ఏవీ లేవు. ఈ అమ్మడు ప్రస్తుతం RC 15 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే అంజలికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కోలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమాయణం నడుపుతోంది అంటూ ఎన్నో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇక వార్తలకు చెక్ పెట్టి, అంజలి తన తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందంటూ మరో వార్త వైరల్ అవుతోంది. ఆర్ సీ 15 సినిమా పూర్తికాగానే అంజలి పెళ్లి పీటలెక్కబోతుందని సమాచారం

Advertisement

Next Story